టాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. నందమూరి బాలకృష్ణ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ఉండనుందనే ప్రచారం జోరుగా సాగింది. మొత్తానికి ఈ ప్రచారమే నిజమైంది. ‘దేవర’ సినిమా తెరకెక్కించిన యువ సుధ ఆర్ట్స్ బ్యానర్పై బాలకృష్ణ, కొరటాల శివ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలవుతుందని Yuvasudha Arts ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. POWER MEETS PURPOSE MASS BECOMES A MOVEMENT అనే పవర్ఫుల్ కొటేషన్తో పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు.
The Stars Align ✨
— Yuvasudha Arts (@YuvasudhaArts) May 1, 2026
A Festival Awaits 💥💥#NBKxKoratalaSiva ❤🔥#NBK112 pic.twitter.com/PiBfFRWSeV
ఈ కొటేషన్ చూస్తుంటే.. ఈ సినిమాలో కూడా కొరటాల మార్క్ పవర్ఫుల్ మెసేజ్ ఉంటుందని స్పష్టమైంది. బాలకృష్ణ ప్రస్తుతం ‘వీర సింహా రెడ్డి’ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దసరాకు రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నారు. ఇక.. కొరటాల శివ విషయానికొస్తే.. ప్రశాంత్ నీల్ సినిమాతో ఎన్టీఆర్ బిజీగా ఉండటంతో ప్రస్తుతానికి ‘దేవర2’ను పక్కన పెట్టేసి బాలకృష్ణ కోసం పవర్ ఫుల్ కంటెంట్ రాసుకున్నాడు.
బాలయ్యకు కూడా ఈ కథ నచ్చడంతో కొరటాల శివ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవికి చేదు అనుభవం మిగిలింది. ‘ఆచార్య’ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో బాలకృష్ణ విషయంలో అలా జరగకూడదని కొరటాల శివ కసిగా కంటెంట్ రాసుకుని.. బాలయ్యకు నెరేట్ చేశాడు. బాలయ్యకు ఈ కథ బాగా నచ్చింది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్.. ఇతరత్రా టెక్నీషియన్లు ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడించనున్నారు.
