రష్యా మిలటరీ వాహనాలపై ‘Z’ గుర్తు.. దాని అర్థమేంటి?

రష్యా మిలటరీ వాహనాలపై ‘Z’ గుర్తు.. దాని అర్థమేంటి?

కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే అనేక ప్రాంతాలపై రష్యా సైన్యం పట్టుసాధించింది. అయితే, ఆక్రమణ మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ బార్డర్ తోపాటు నగరాల్లో వేలాది రష్యన్ యుద్ధ వాహనాలు తిరుగుతున్నాయి. ఎక్కడ చూసినా రష్యా మిలటరీ వెహికిల్స్ కనిపిస్తున్నాయి. అయితే ఆ వాహనాలను పరిశీలిస్తే.. వాటి వెనుకవైపు ‘Z’ అనే గుర్తు కనిపిస్తోంది. అసలు ‘Z’ అనే సింబల్ వెనుక ఉన్న అర్థమేంటనేది హాట్ టాపిక్ గా మారింది. 

సోషల్ మీడియా వేదికగా ఈ అక్షరం వెనుక అసలు అర్థం ఏంటో తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేస్తున్నారు. రష్యా నుంచి ఉక్రెయిన్ లోకి వెళ్లే వెహికిల్స్ మీద మాత్రమే ‘Z’ అక్షరాలను ముద్రించారని.. అయితే ఆ గుర్తును కొందరు విజయానికి చిహ్నంగా భావిస్తారని మాస్కోలోని పరిశోధకుడు, జర్నలిస్ట్ కామిల్ గలీవ్ చెప్పారు. మరికొందరు ‘Z’ ను Zapad అనే పదం కోసం వినియోగిస్తారని.. దానర్థం ‘పశ్చిమం’ అని వివరించారు. ప్రస్తుతం ఇది రష్యన్ భావజాలంగా, జాతీయ గుర్తింపునకు చిహ్నంగా మారిందని వివరించారు. యుద్ధభూమిలో రష్యన్ సైనికులు పొరపాటున ఒకరిపై ఒకరు దాడి చేసుకోకుండా.. గందరగోళానికి గురికాకుండా ఈ తరహా ముద్రలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. రష్యాలోని కొన్ని వర్గాల్లో Z గుర్తుకు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ అక్షరాన్ని టీ–షర్ట్‌లపై ముద్రించి, వాటిని ధరించి తిరుగుతున్నారు. కొందరు తమ కార్లపైనా ఈ గుర్తును ముద్రిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం:

మరోసారి వీడియో విడుదల చేసిన జెలెన్ స్కీ

ఉక్రెయిన్ ఆర్మీలో చేరిన తమిళనాడు యువకుడు

హాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన ఆలియా