ఉక్రెయిన్ ఆర్మీలో చేరిన తమిళనాడు యువకుడు

ఉక్రెయిన్ ఆర్మీలో చేరిన తమిళనాడు యువకుడు

కీవ్: రష్యా సైనికచర్యతో ఉక్రెయిన్ అట్టుడుకుతోంది. రష్యన్ బలగాలు కురిపిస్తున్న బాంబుల వర్షం ధాటికి రాజధాని కీవ్ తోపాటు ఖర్కీవ్, మరియుపోల్, సుమీ వణుకుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడంపై మోడీ సర్కార్ దృష్టి పెట్టింది. ఇప్పటికే భారీ సంఖ్యలో ఇండియన్లను ప్రత్యేక విమానాల ద్వారా భారత్ కు తీసుకొచ్చింది. అయితే తమిళనాడుకు చెందిన ఓ యువకుడు మాత్రం భారత్ కు ఇంకా చేరుకోలేదు. ఖర్కీవ్ లోని నేషనల్ ఏరోస్పేస్ యూనివర్సిటీలో చదువుకుంటున్న 21 ఏళ్ల సైనికేశ్ రవిచంద్రన్ కు.. ఉక్రెయిన్ వీడటానికి మనసు రాలేదు. కష్టకాలంలో ఆ దేశం తరఫున పోరాడాలని నిర్ణయించుకున్న సైనికేశ్.. రష్యాతో ఫైట్ చేస్తున్న ఉక్రెయిన్ పారామిలిటరీ ఫోర్సెస్ లో జాయిన్ అయ్యాడు. 

సైనికేశ్ యుద్ధరంగంలో పోరాడుతున్న విషయాన్ని అతడి కుటుంబం వెల్లడించింది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల వివరాలు తెలుసుకునేందకు సంబంధించి కోయంబత్తూర్ లోని సైనికేశ్ ఇంటికి అధికారులు వెళ్లారు. సైనికేశ్ గురించి అతడి ఇంట్లో వాళ్లను అధికారులు ప్రశ్నించగా.. అతడు ఇంకా ఉక్రెయిన్ లోనే ఉన్నాడని వాళ్లు చెప్పారు. దేశానికి సేవ అందించాలనే కోరికతో ఇండియన్ ఆర్మీకి సైనికేశ్ అప్లయ్ చేశాడని.. కానీ అతడు సెలెక్ట్ కాలేదని తెలిపారు. అనంతరం ఉన్నత విద్య కోసం ఉక్రెయిన్ వెళ్లాడన్నారు. ఉక్రెయిన్ లో ఉద్రిక్తతల నేపథ్యంలో సైనికేశ్ తో మాట్లాడటం కష్టమైందని.. కానీ భారత ఎంబసీ సాయం చేయడంతో అతడితో కాంటాక్ట్ అయ్యామని కుటుంబీకులు తెలిపారు. ఉక్రెయిన్ పారామిలిటరీ ఫోర్సెస్ లో తాను జాయిన్ అయిన విషయాన్ని స్వయంగా సైనికేశ్ యే తమకు చెప్పాడని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తల కోసం:

హాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన ఆలియా

అమాయకులను చంపుతున్న రష్యన్లను వదిలిపెట్టం

ఏడేండ్లల్ల ఏడు రెట్లు పెరిగిన అప్పులు