టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రాజస్థాన్.. 

టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రాజస్థాన్.. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరుగుతున్న కీలక పోరులో రాజస్థాన్ రాయల్స్ (RR) తాత్కాలిక కెప్టెన్ జైస్వాల్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే రాజస్థాన్‌కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కాగా.. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన లక్నో, రాయల్స్ అవకాశాలను దెబ్బతీసి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. ఇక ఈ మ్యాచులో ఇరు జట్లు పలు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి.

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ యశస్వి జైస్వాల్ మాట్లాడుతూ.. మేము మొదట బౌలింగ్ చేస్తాం.. ఈ పిచ్ బాగుంది.. తర్వాత మంచు ప్రభావం ఉండొచ్చు.. రాజస్థాన్ రాయల్స్‌కు నాయకత్వం వహించడం నాకు ఎంతో ప్రత్యేకం.. ఈ మ్యాచ్ కి ముందు రియాన్ పరాగ్ గాయంతో జట్టు నుంచి దూరం కాగా, జడ్డూ భాయ్ చిన్న నొప్పితో కోలుకుంటున్నాడు, త్వరలోనే జట్టులోకి వస్తాడు.. జట్టులో మూడు మార్పులు చేశాం. మైండ్‌సెట్, ఆటిట్యూడ్ చాలా ముఖ్యం.. అందరూ ఒత్తిడి లేకుండా ఆటను ఎంజాయ్ చేయాలని చెప్పినట్లు యశస్వి జైస్వాల్ పేర్కొన్నాడు. 

లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ మాట్లాడుతూ.. ఈ పిచ్ గురించి మాకు పూర్తిగా తెలుసు.. బ్యాటింగ్‌కు ఇది మంచి వికెట్.. మొదట బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా మాకు ఒకటే.. మేము ఆడటానికి ఇంకా చాలా ఉంది.. ఫ్రాంచైజీ ఓనర్లు, అభిమానుల కోసం ఆడటాన్ని గర్వంగా భావిస్తాం.. ఐడెన్ వ్యక్తిగత కారణాల వల్ల ఇంటికి వెళ్లాడు.. షమీ దూరమయ్యాడు, అతని స్థానంలో మోహ్‌సిన్ వచ్చాడు.. మార్క్‌రమ్ స్థానంలో ఆయూష్ బదోని ఆడుతున్నట్లు పంత్ వెల్లడించాడు. 

ఇరు జట్లు:
లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(వికెట్ కీపర్/కెప్టెన్), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, ఆకాష్ మహరాజ్ సింగ్, ప్రిన్స్ యాదవ్

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్ (కెప్టెన్), లువాన్-డ్రే ప్రిటోరియస్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), డోనోవన్ ఫెరీరా, శుభమ్ దూబే, దసున్ షనక, జోఫ్రా ఆర్చర్, సుశాంత్ మిశ్రా, సందీప్ శర్మ, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా