బీటెక్, డిగ్రీ అర్హతతో NHAI డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు...

బీటెక్, డిగ్రీ అర్హతతో NHAI డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు...

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్​ ఇండియా దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బి.టెక్/ బీఈ పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ  మే 15న ప్రారంభమై, జూన్ 15న ముగుస్తుంది. 

పోస్టు పేరు: డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్).
మొత్తం ఖాళీలు: 60. (అన్ రిజర్వ్డ్ 26, ఎస్సీ 09, ఎస్టీ 04, ఓబీసీ 16, ఈడబ్ల్యూఎస్ 05).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్​లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. గేట్–2026లో సివిల్ ఇంజినీరింగ్ లో వ్యాలిడ్ గేట్​ స్కోర్ కలిగి ఉండాలి. 2026, జూన్ 15వ తేదీ నాటికి ఫలితాలు వెలువడని అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ, 2026, ఆగస్టు 31 లోగా డిగ్రీ ప్రొవిజనర్ సర్టిఫికెట్ ను సమర్పించాల్సి ఉంటుంది. 
గరిష్ట వయోపరిమితి: 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మే 15.
లాస్ట్ డేట్: జూన్ 15.
సెలెక్షన్ ప్రాసెస్: గేట్–2026 స్కోర్ (సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు ఎన్​హెచ్ఏఐలో చేరిన తేదీ నుంచి కనీసం మూడేళ్లపాటు పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ. 5లక్షల బాండ్ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.nhai.gov.inను సందర్శించండి.