ఈ వందేళ్లలో వరస్ట్ ఫుడ్ ఇదే..

ఈ వందేళ్లలో వరస్ట్ ఫుడ్ ఇదే..

ప్రపంచంలో అనేక దేశాలు  విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు..ఆహారపు అలవాట్లు కలిగి ఉంటాయి. ఒక్కో దేశంలో ఒక్కో వంటకం ఫేమస్. కొన్ని దేశాల్లో అద్బుతమైన వంటకాలు జనాల మనసును దోచేస్తాయి. అందుకే ఆ దేశానికి వెళ్లినప్పుడు ఖచ్చితంగా వాటిని టేస్ట్ చేస్తారు. అదే తరహాలో కొన్ని దేశాల్లో చెత్త వంటకాలు ఉంటాయి. వాటినే చూస్తే అసహ్యం వేస్తోంది. అందుకే జనాలు అస్సలు వాటిని పట్టించుకోరు. స్వదేశంలోనే కాదు..పర్యాటకులు కూడా వాటిని తినేందుకు ఇష్టపడరు. అలాంటి వంటకం రష్యాలో కనుగొన్నారు. ఇది ప్రపంచంలోనే చెత్త వంటకంగా ఫేమస్ అయింది. 

ఆడిటీ సెంట్రల్ న్యూస్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం రష్యాలోని యాకుటియాలో ప్రత్యేక రకం రష్యన్ ఫిష్ సలాడ్‌ను తయారు చేస్తారు, దీనిని ఇండిగిర్కా సలాడ్ అని పిలుస్తారు. దానిని ఎవరు తిన్నా కూడా వారికి చెడు జరుగుతుందని నమ్మకం. 2022 లో ప్రపంచ వ్యాప్తంగా వరస్ట్  సాంప్రదాయ వంటకాలపై టేస్ట్‌ అట్లాస్ ర్యాంకులు ఇచ్చింది. ఈ ర్యాంకుల్లో   ఇండిగిర్కా సలాడ్ ..వరల్డ్ వరస్ట్ వంటకంగా నిలిచింది. 

20వ శతాబ్దంలో కనుగొన్నారు..

ఇండిగిర్కా సలాడ్ టెస్ట్ అట్లాస్‌ ర్యాంకింగ్స్ లో 1.4 స్కోర్‌ను మాత్రమే పొందింది. ప్రపంచంలో అన్ని వంటకాల్లో ఇదే తక్కువ ర్యాంకు సాధించింది. దీంతో చెత్త వంటకం హోదాను పొందింది.అయితే తమ స్థానిక వంటకం చెత్త వంటకంగా నిలవడంపై  యాకుటియా ప్రజలు కలత చెందుతున్నారు. ఈ వంటకం 20వ శతాబ్దంలో కనుగొన్నారని చెప్తున్నారు. చెఫ్ ఇన్నోకెంటీ టార్బఖోవ్ ఈ వంటకాన్ని తయారు చేసినట్లు వెల్లడించారు.  యాకుటియన్ ప్రధాన నదుల్లో ఇండిగిర్కా నది ఒకటని...అందుకే ఈ వంటకానికి ఇండిగిర్కా సలాడ్ అని పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చారు. అయితే కొందరు రష్యన్ వ్లాగర్లు యూట్యూబ్‌లో ఈ వంటకాన్ని ప్రమోట్ చేయడంతో...ప్రస్తుతం డిష్ ర్యాంకింగ్ 2.1కి చేరుకుంది.

ఇండిగిర్కా సలాడ్ ఎలా చేస్తారంటే..

ఇండిగిర్కా సలాడ్ చేయాలంటే ముందుగా గడ్డకట్టిన చేపను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దానికి కట్ చేసిన ఉల్లిపాయలు కలుపుకోవాలి. వీటికి సరిపడా నూనే, ఉప్పు, కారం దట్టించాలి. ఆ తర్వాత బాగా కలుపుకోవాలి. దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి. అంతే ఇండిగిర్కా సలాడ్ రెడీ. సలాడ్లో వోడ్కా షాట్స్ లేదా నిమ్మకాయ రసంతో తింటే టేస్ట్ వస్తుందట.