రెండేళ్లలో మస్తు జాబ్స్‌‌ ఇస్తం

రెండేళ్లలో మస్తు జాబ్స్‌‌ ఇస్తం

ఐటీ అసెట్స్‌‌, క్లౌడ్‌‌ కంప్యూటింగ్‌‌, ఎడ్జ్‌‌ కంప్యూటింగ్‌‌ నిర్వహించే ఆటోమేషన్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌ ఇవాంటి  బిజినెస్‌‌ను పెద్ద ఎత్తున విస్తరించడానికి రెడీ అయింది. భారీ సంఖ్యలో ఎంప్లాయిస్‌‌నూ తీసుకుంటామని ప్రకటించింది.  ఉద్యోగుల సంఖ్యను రాబోయే  రెండు సంవత్సరాలలో 500 నుంచి 2000 కి పెంచుతామని ప్రకటించింది. వీరిలో ఎక్కువ మంది హైదరాబాద్‌‌లోనే పనిచేస్తారు. గతంలో కంపెనీకి ఇండియాలో 100 కంటే తక్కువ మంది ఉద్యోగులుండగా, టోటల్‌‌ ప్రాడక్ట్‌‌, సొల్యూషన్స్‌‌ను అందించడం కోసం నాలుగు కంపెనీలను కొనుగోలు చేసింది.

త్వరలో తాము యూనిఫైడ్‌‌ ఎండ్‌‌పాయింట్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌, జీరో ట్రస్ట్‌‌ సెక్యూరిటీ, ఎంటర్‌‌ప్రైజ్‌‌ సర్వీస్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ కంపెనీగా మారబోతున్నామని ప్రకటించింది. ‘‘డేటా, ఇన్ఫర్‌‌మేషన్‌‌, డివైజ్‌‌లు అనేవి ఎప్పుడూ సేఫ్‌‌ కాదని కరోనా సమయంలో కంపెనీలకు తెలిసివచ్చింది. ర్యాన్సమ్‌‌వేర్‌‌, మాల్‌‌వేర్‌‌, ఫిషింగ్‌‌, సైబర్‌‌ దాడులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సవాళ్లు.  ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి మేం ఎవ్రీవేర్‌‌ వర్క్‌‌ప్లేస్‌‌ విధానాన్ని అందిస్తాం. జీరో సైబర్‌‌ సెక్యూరిటీ బ్రేకింగ్‌‌తో పనిచేయడానికి సంస్థలకు సహాయపడుతాం’’ అని ఇవాంటి సర్వీస్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ సొల్యూషన్స్‌‌ గ్రూప్‌‌  ప్రెసిడెంట్‌‌, చీఫ్‌‌ ప్రొడక్ట్‌‌ ఆఫీసర్‌‌ నాయకీ నయ్యర్‌‌ చెప్పారు. ఇవాంటి డెవలప్‌‌ చేసిన యూనిఫైడ్‌‌ ఎండ్‌‌పాయింట్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌  ప్లాట్‌‌ఫామ్‌‌   ఐటీ కంపెనీలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఇవాంటి సెక్యూరిటీ ప్రొడక్ట్స్‌‌, సీనియర్‌‌ వైస్‌‌ ప్రెసిడెంట్‌‌, శ్రీనివాస్‌‌ ముక్కామల మాట్లాడుతూ మెరుగైన హైబ్రిడ్‌‌ పని వాతావరణం కోసం తమ కొత్త ప్రాడక్ట్‌‌లు డేటా బ్రీచింగ్‌‌ల ప్రమాదాన్ని తగ్గిస్తాయని తెలిపారు.