బోల్డ్ చెప్పేసిన బ్యూటీ : నా వయస్సు 44 అండీ.. 35 కాదు.

బోల్డ్ చెప్పేసిన బ్యూటీ : నా వయస్సు 44 అండీ.. 35 కాదు.

తిలోతమా షోమ్( Tillotama Shome)  ఒక భారతీయ నటి. అనేక  ఇండిపెండెంట్ షార్ట్ ఫిలింలో యాక్ట్ చేసి మంచి గుర్తింపు పొందారు. 2018 లో, 66వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో సర్ చిత్రంలో ఇంటి పనిమనిషి పాత్రను పోషించినందుకు తన నటనకు ఉత్తమ నటిగా (క్రిటిక్స్) ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది. 

తాజాగా తన ట్విట్టర్ ద్వారా పలు ఇంట్రెస్టింగ్ విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. వికీపీడియాలో తన వయస్సు గురుంచి చెబుతూ ..
'నా అసలు వయసు 44. కానీ వికీపీడియాలో 35  ఉందని.. దానిని 44కి ఎలా మార్చుకోవాలో అని ట్విట్టర్ నుంచి వినియోగదారులను అడిగింది. అసలు పేజీ చూసి  నా వయస్సు 35 ఉండటం షాక్ అయ్యాను' అని తెలియజేసింది. 

Also Read :- వీడి కంటే వీధి కుక్క నయం..: రోడ్డుపైనే బట్టలు విప్పేసి.. మహిళను రేప్ చేయబోయాడు

ట్విట్టర్ యూసర్ ఇదే విషయానికి రిప్లై ఇస్తూ.. "మీరు 'మాన్‌సూన్ వెడ్డింగ్' మూవీ చేసినప్పుడు మీకు 13 ఏళ్లు ఎలా ఉన్నాయని ఆశ్చర్యపోతున్నారా"  అని అడిగాడు, తిలోతమ కూడా ఆ జోక్‌కి నవ్వింది. మరొక యూసర్ ఇలా పేర్కొన్నాడు, "వికీపీడియాలో మార్చడానికి ఎందుకు బాధపడతారు. మీరు 35 ఏళ్ల వయస్సులో ఉన్నట్లుగా నమ్మండి..అలాగే ఉన్నట్లు నటించండి" అంటూ రిప్లై ఇచ్చాడు.

తిలోతమా షోమ్ ఢీల్లీ క్రైమ్, లస్ట్ స్టోరీస్ 2 వంటి మూవీస్ లో నటించి అందరినీ ఆకట్టుకుంది. తిలోతమా పలు మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు.