
ఆది మానవులు కూడా ఇంతలా బరితెగించి ఉండరు.. కానీ ఆధునిక కాలంలో ఉచ్చ నీచాతి నీచం మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు మనుషులు. ఎక్కడో ఏ అడవిలోనో ఇలాంటి ఘటన జరిగింది అనుకుంటే అది వేరే విషయం.. నిత్యం జనం తిరిగే ప్రాంతంలో.. నడి వీధిలో.. మనుషులు నడియాడే రోడ్డులో ప్రపంచ నివ్వెరపోయిన ఘటన జరిగింది. అది ఎక్కడో కాదు.. పాకిస్తాన్ దేశంలో. ప్రపంచం మొత్తం నివ్వెరపోయిన ఘటన పాక్ లో జరగటం.. ఇప్పుడు ఆ దేశానికి తలవంపులుగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
పాకిస్తాన్ దేశంలోని ప్రధానమైన నగరం కరాచీ. సిటీలోని జోహార్ బ్లాక్ 4లోని ఓ వీధి. ఓ వ్యక్తి బైక్ పై వచ్చాడు. షార్ట్ ధరించి ఉన్నాడు. వీధిలోని ఓ ఇంటి ముందు బైక్ ఆపి.. చెట్ల చాటుకు వెళ్లి తాను ధరించిన షార్ట్ విప్పేస్తాడు. ఓ రకంగా నగ్నంగా.. చెట్ల చాటు నుంచి బయటకు వస్తాడు. అదే సమయంలో బురఖా ధరించిన ఓ మహిళ ఆ వీధి నడుచుకుంటూ వెళుతుంది. ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా.. ఆమె వెంట పడి.. ఆమెను వెనక నుంచి బలంగా పట్టుకుంటాడు. రోడ్డుపైనే రేప్ చేయటానికి ప్రయత్నిస్తాడు. దీంతో షాక్ అయిన ఆ మహిళ పెద్దగా అరుస్తూ.. అతని నుంచి తప్పించుకుని పరిగెడుతుంది.
ఈ ఘటన అంతా ఆ వీధిలోని ఓ ఇంటి ముందు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలోకి రావటంతో ప్రపంచం మొత్తం షాక్ అయ్యింది. నడిరోడ్డుపై.. అర్థ నగ్నంగా.. అత్యాచారానికి తెగబడుతున్న సంఘటన చూసి నోరెళ్లబెట్టింది. మనుషుల మధ్య ఉన్నామా.. పశువుల మధ్య జీవిస్తున్నామా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత పాక్ దేశం సింధు రాష్ట్రం సీఎం మురాద్ అలీ షా స్పందించారు. ఇంత నీచంగా ప్రవర్తించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వెంటనే పట్టుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు సింధ్ మంత్రి షర్జీల్ మెమన్ ట్విట్టర్ లో తెలిపారు. ఈ కేసును సుమోటోగా తీసుకున్న కరాచీ పోలీసులు నిందితుడిని పట్టుకోవటానికి గాలింపు చేపట్టారు.
అతన్ని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆదేశాలు జారీ చేశాడు. కొంచెం గుండె నిబ్బరం చేసుకుని మీరు కూడా ఈ వీడియో చూడండి.. మన మధ్య కూడా ఇలాంటి సన్నాసులు, పనికిమాలిన వెధవలు ఉండొచ్చు.. బీ కేర్ ఫుల్ బిడ్డలూ.. మనల్ని మనమే కాపాడుకోవాల్సిన రోజులు వచ్చేశాయ్...