
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) .. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej) కాంబోలో వస్తున్న మూవీ 'BRO'.. తాజాగా మరో అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ మూవీ నుంచి సెకండ్ లిరికల్ జాణవులే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గీతాన్ని కాసార్ల శ్యామ్ రచించగా .. థమన్, కె ప్రణతి పాడారు.
బేబీ లవ్ యూ బేబీ అంటూ థమన్ స్వరపరిచిన ఈ సాంగ్ లవర్స్ కు కిక్ ఇచ్చేలా కనిపిస్తోంది. 'కుశలమా.. కునుకు మరిచి ఓ నేస్తమా.. కలలతో కలత నిదుర నీ బంధమా..' లిరిక్స్ హత్తుకునేలా ఉన్నాయి. ఇక భాను మాస్టర్ కొరియోగ్రాఫీ బాగుంది అంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
ఈ సాంగ్ తో ప్రేమికులకు దగ్గర అవ్వడానికి బ్రో టీం ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రేమ గీతం ఎలాంటి అనుభూతి కలిగిస్తుందో చూడాలి. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ డాన్స్ బ్రో.. లైక్ బ్రో..సాంగ్ మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అయినా విషయం తెలిసేందే.
ALSO READ :వ్యూహం మూవీ నుంచి.. పవన్ పోస్టర్ తో వర్మ ట్వీట్
థమన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ చిత్రంలో కేతికా శర్మ, ప్రియాప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ మూవీ వినోదయ సీతంకు రీమేక్‌గా సముద్రఖని(Samuthirakani) బ్రో మూవీని తెరకెక్కిస్తున్నారు. త్రివిక్రమ్(Trivikram) మాటలు అందిస్తుండగా..పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) బ్యానర్ పై నిర్మిస్తున్నారు. బ్రో మూవీ జూలై 28న థియేటర్లలో రీలిజ్ కానుంది.