అయ్యయ్యో.. హాల్ టిక్కెట్లు ఇచ్చారు.. పరీక్ష మర్చిపోయారు

అయ్యయ్యో.. హాల్ టిక్కెట్లు ఇచ్చారు.. పరీక్ష మర్చిపోయారు

ఎగ్జామ్ నిర్వహణకు తేదీ ప్రకటించారు.. పరీక్ష ఫీజులు చెల్లించారు విద్యార్ధులు.. హాల్ టికెట్లు కూడా ఇచ్చారు.. కానీ ప్రకటించిన తేదీన ఎగ్జామ్ నిర్వహించాలన్న విషయం మర్చిపోయింది ఓ యూనివర్సిటీ అథారిటీ. విద్యార్థులు ఎగ్జామ్ తేదీన యూనివర్సిటీకి వెళ్లి షాక్ కు గురయ్యారు. ఎగ్జామ్ ఏర్పాట్లు చేయలేదు.. ఎగ్జామ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాటు చేయలేదు. వివరాల్లోకి వెళితే.. 

జబల్పూర్ యూనివర్సిటీ పరీక్షల విభాగం .. MSc కంప్యూటర్ సైన్స్ పరీక్షను నిర్వహించడం మర్చిపోయింది. టైంటేబుల్ విడుదల చేసి అడ్మిట్ కారులను జారీ చేసినప్పటికీ పరీక్ష నిర్వహించడంలో విశ్వవిద్యాలయం విఫలైంది. మొదటి సెమిస్టర్ కు సంబంధించిన షెడ్యూల్ మార్చి 5 న జరగాల్సి ఉండగా.. పరీక్ష నిర్వహణకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. 

విసుగు చెందిన విద్యార్థులు యూనివర్సిటీలో నిరసనలు చెపట్టారు. స్పందించిన యూనివర్సిటీ వీసీ.. పరీక్ష విభాగ అధిపతులతో మాట్లాడగా పరీక్ష వాయిదా వేసినట్లు తెలిపారు.. కానీ విద్యార్థులకు తెలుపలేదు. దీనిపై విచారణ చేపట్టారు. బాధ్యులైన అధికారుల పై చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు హామీ ఇచ్చారు వీసీ.