పాత పెన్షన్ సాధించేవరకు పోరాటం చేస్తాం : జేఏసీ చైర్మన్ దొంత నరేందర్

పాత పెన్షన్ సాధించేవరకు పోరాటం చేస్తాం : జేఏసీ చైర్మన్ దొంత నరేందర్

మెదక్, వెలుగు: నూతన పెన్షన్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ సాధించేవరకు పోరాటం చేస్తామని జేఏసీ చైర్మన్ దొంత నరేందర్ అన్నారు. సోమవారం మెదక్ కలెక్టరేట్ ముందు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఉద్యోగికి పెన్షన్ హక్కు అని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. మెదక్ జిల్లా రాజన్న సిరిసిల్ల జోన్ లో ఉండడం వల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు.

 చార్మినార్ జోన్ లో కలిపేలా ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలోనే అన్ని వర్గాల ఉద్యోగులతో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. సీపీఎస్​వద్దు ఓపీఎస్ ముద్దు, సీపీఎస్​అంతం జేఏసీ పంతం అంటూ ఉద్యోగులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ నగేశ్ కు డిమాండ్ లతో కూడిన వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు విఠల్, రాజ్ కుమార్, నాగభూషణం, మహేందర్ గౌడ్, రాజగోపాల్ గౌడ్, పద్మారావు, చరణ్ సింగ్, శ్రీనివాస్, పోచయ్య, ఇక్బాల్ పాషా, కోశాధికారి చంద్రశేఖర్, పజాలుద్దీన్, శంకర్, శివాజీ, గోపాల్, నర్సింలు, సతీశ్, సలావుద్దీన్ పాల్గొన్నారు.