ఆర్టీసీ విలీనానికి ముందే కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి

ఆర్టీసీ విలీనానికి ముందే కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ విలీనానికి ముందే కార్మికుల సమస్యలను సర్కార్​పరిష్కరించాలని జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో ఆందోళనలు చేపడుతున్నట్లు ప్రకటించారు. ఆదివారం వీఎస్టీలోని ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్‌‌లో జేఏసీ మీటింగ్ జరిగింది. 

నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించాలని ప్రకటనలో ఆయన పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారం కోసం ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేయాలని నిర్ణయించామని, త్వరలో తేదీ వెల్లడిస్తామని తెలిపారు. 2017, 2021 పీఆర్సీ, 2012 పీఆర్సీ 50 శాతం బకాయిలు, ఈ ఏడాది జనవరి, జులై డీఏలు, డీఏ ఎరియర్స్ రూ.700 కోట్లు, సీసీఎస్ బకాయిలు రూ.1,050 కోట్లు , ఎస్ఆర్బీఎస్ రూ.540 కోట్లు, పీఎఫ్ రూ.1,270 కోట్లు, ఎస్బీటీ రూ.140 కోట్లు, రిటైర్ అయిన కార్మికులకు సెటిల్‌‌మెంట్ బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్​చేశారు.