హైదరాబాద్, వెలుగు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తెలంగాణ ప్రజల మనస్సు ఎంత గొప్పదో ఇప్పటికైనా అర్థమై ఉంటుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. తెలంగాణ ప్రజల నరదిష్టి కోనసీమకు తగిలిందంటూ పవన్ కల్యాణ్ బాధపెట్టే వ్యాఖ్యలు చేసినా..శనివారం ఆయన కొండగట్టుకు వచ్చిన సందర్భంగా ఇక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారన్నారు.
అత్యంత గౌరవం ఇచ్చారని చెప్పారు. ప్రోటో కాల్లో కూడా ఆయన పేరును పైన పెట్టి మా మంత్రుల పేర్లను కింద పెట్టామని, ఇప్పటికైనా పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజల గొప్పతనాన్ని గుర్తించాలన్నారు. తెలంగాణవారు ఎప్పుడూ ఇతరుల బాగు కోరుతారే తప్ప వాళ్లకు దిష్టిపెట్టరని అనురుధ్ రెడ్డి పేర్కొన్నారు.
