
ఈ లోక్‌సభ ఎన్నికల్లో తామే గెలుస్తామంటున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి… నిజంగా గెలుస్తానని ధైర్యం, దమ్ము ఉంటే ఈ క్షణమే తన పదవికి రాజీనామా చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఈ రోజు నల్లగొండలో జిల్లా శాసనసభ నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గోన్న జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం కోసం దేశం మొత్తం ఎదురు చూస్తుందని, ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ హవా కొనసాగాలని అన్నారు.
విపక్ష పార్టీకి ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్ధులే దొరకట్లేదని, అటువంటి పార్టీ భవిష్యత్తులో తెలంగాణలో ప్రశ్నార్ధకంగా మారిందని జగదీశ్ అన్నారు. నల్లగొండలో చెల్లని కోమటిరెడ్డి అభ్యర్థి భువనగిరిలో చెల్లుతుందా అని మంత్రి ఈ సందర్భంగా ప్రశ్నించారు.