ప్రపంచంలోనే అతిపెద్ద ల్యాండ్ స్కామ్ : జగదీశ్ రెడ్డి

ప్రపంచంలోనే  అతిపెద్ద ల్యాండ్ స్కామ్ : జగదీశ్ రెడ్డి

    ఇందులో రేవంత్​బంధువులు 40మంది ఉన్నరు: జగదీశ్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్​కు కాంగ్రెస్ ప్రభుత్వం తెరదీసిందని బీఆర్ఎస్​ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్టు కట్టబెడుతున్నారని తెలిపారు.10 వేల ఎకరాల భూములను చౌకగా తన బంధువులను కట్టబెట్టేందుకు రేవంత్​సిద్ధమయ్యారని చెప్పారు. 

గురువారం ఆయన తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. ఈ స్కామ్​లో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు 40 మంది ఉన్నారని, త్వరలోనే వారి పేర్లను బయటపెడతామని పేర్కొన్నారు. ఓఆర్ఆర్​ దగ్గర ఎకరం రూ.137 కోట్లు పలికిందని చెబుతున్న ప్రభుత్వం.. సిటీ నడిబొడ్డున ఉన్న భూములను మాత్రం అతి తక్కువ ధరకే కట్టబెడుతున్నదని మండిపడ్డారు. 

దొంగలు దొంగలు కలిసి భూములు పంచుకోవడమే ఈ ల్యాండ్ స్కామ్ లక్ష్యమని వెల్లడించారు. నాచారం, బాలానగర్​లో గజం లక్ష యాభై వేలు మార్కెట్ ధర ఉంటే.. రూ.10 వేలకే కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.