ఎన్ బీఎఫ్ సీ పిరమల్ ఫైనాన్స్ ఏయూఎం లక్ష్యం.. రూ.1.5 లక్షల కోట్లు

ఎన్ బీఎఫ్ సీ పిరమల్  ఫైనాన్స్  ఏయూఎం లక్ష్యం.. రూ.1.5 లక్షల కోట్లు
  • 2028 నాటికి చేరుకుంటామన్న పిరమల్​  ఫైనాన్స్​
  • బంగారం లోన్ల విభాగంలోకీ వస్తామని వెల్లడి

హైదరాబాద్​, వెలుగు: ఎన్​బీఎఫ్​సీ పిరమల్ ఫైనాన్స్ 2028 ఆర్థిక సంవత్సరం నాటికి నిర్వహణలోని ఆస్తుల​(ఏయూఎం) విలువను రూ.1.5 లక్షల కోట్లకు చేర్చాలని టార్గెట్​గా పెట్టుకుంది. తెలంగాణలో విస్తరిస్తామని ప్రకటించింది. హోం లోన్లు, ఎంఎస్​ఎంఈ లోన్లకు తెలంగాణ ముఖ్యమైన మార్కెట్‌‌ అని, ఇక్కడ 29 బ్రాంచ్​లు ఉన్నాయని తెలిపింది.  

కంపెనీ రిటైల్  లెండింగ్  సీఈఓ జగదీప్ మల్లారెడ్డి హైదరాబాద్​లో గురువారం మీడియాతో మాట్లాడుతూ ‘‘మా రిటైల్  ఏయూఎం నాలుగు సంవత్సరాలలో 3.5 రెట్లు పెరిగి రూ.75 వేల కోట్లు దాటింది. 

2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దీనిని రూ.లక్ష కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పండుగ సీజన్‌‌లో రిటైల్​ లోన్లు 45 శాతం పెరిగాయి. చిన్న పట్టణాలు, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు మా వృద్ధిని పెంచుతున్నాయి. 

త్వరలో బంగారం లోన్ల విభాగంలోకి కూడా వస్తాం. 2026 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ నాటికి కంపెనీ కన్సాలిడేటెడ్​ ఏయూఎం రూ.91,477 కోట్లకు చేరింది. క్రెడిట్ ​హిస్టరీ లేని వారికి కూడా అప్పులు ఇస్తున్నాం. ఇందుకోసం ఏఐ, ఎంఎల్​ వంటి టెక్నాలజీలను వాడుతున్నాం”అని ఆయన వివరించారు.