నవంబర్ 29 తెలంగాణ ఉద్యమ చరిత్రలో గొప్పరోజు : తలసాని శ్రీనివాస్ యాదవ్

నవంబర్ 29 తెలంగాణ  ఉద్యమ చరిత్రలో గొప్పరోజు : తలసాని శ్రీనివాస్ యాదవ్
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కామెంట్​

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో  నవంబర్ 29 చరిత్రలో నిలిచిపోయే రోజు అని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశ రాజకీయాల్లో పెను భూకంపం సృష్టించిందని తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను పదేండ్లలో కేసీఆర్​ఎంతో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. 

అన్ని పండుగలను ఘనంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుపుకున్నామని, సంస్కృతి, సాంప్రదాయాలను పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించామని చెప్పారు. గురువారం తెలంగాణ భవన్​లో నిర్వహించిన పార్టీ జీహెచ్ఎంసీ స్థాయీ జనరల్ బాడీ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. 

ఈ నెల 29న తెలంగాణ భవన్​లో దీక్షా దివస్​ను ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్​ ఆమరణ నిరాహారదీక్షకు సంబంధించిన ప్రత్యేక వీడియోను ప్రదర్శిస్తామని, ఈ కార్యక్రమానికి కేటీఆర్​, హరీశ్​ రావు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా ముఖ్య నేతలంతా వస్తారని వెల్లడించారు.