రూ.50కోట్లతో చెన్నూరు మున్సిపాలిటీ అభివృద్ధి.. మార్నింగ్ వాక్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి

రూ.50కోట్లతో చెన్నూరు మున్సిపాలిటీ అభివృద్ధి.. మార్నింగ్ వాక్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల:50కోట్ల రూపాయలతో చెన్నూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తున్నామని  కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి అన్నారు. గురువారం (నవంబర్ 28) ఉదయం చెన్నూరు టౌన్ లో మార్నింగ్ వాక్ లో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి.. ఇటీవల మరణించిన కాంగ్రెస్ కార్యకర్త కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

అనంతరం స్థానికులతో మాట్లాడుతూ..  చెన్నూరు మున్సిపాలిటీని  అన్ని రంగాల్లో అభివృద్ది చేసి  ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. ఇప్పటికే  రూ.50 కోట్లతో మున్సిపాలిటీలో అభివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో  స్థానిక అధికారులు, చెన్నూరు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.