ప్రధాని మోడీని కలిసిన జగన్

ప్రధాని మోడీని కలిసిన జగన్

ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రెండోసారి ఘన విజయం సాధించిన మోడీకి అభినందనలు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని మోడీని కోరారు జగన్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన ఆయన… అండగా ఉండాలని కోరినట్టు తెలుస్తుంది. స్పెషల్ స్టేటస్ తో పాటు… విభజన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేసినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ నెల 30 న విజయవాడలో జరగనున్న తన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరుకావాలని ప్రధానిని ఆహ్వానించారు. జగన్ వెంట ప్రధానిని కలిసిన వారిలో ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, అవినాశ్ రెడ్డి, బాలశౌరితో పాటు ముఖ్య నేతలు ఉన్నారు. అంతకుముందు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో జగన్ కు వైసీపీ అభిమానులు ఘన స్వాగతం పలికారు.