ఏపీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. 4వ సారి ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేశారు నేతలు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ సహా రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఇవాళ ఉదయం 11గంటల 27నిమిషాలకు చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేయనున్నారు.
ఈ క్రమంలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానిస్తూ మాజీ సీఎం జగన్ కు ఫోన్ చేశారు చంద్రబాబు. అయితే, జగన్ ఫోన్లో అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వైసీపీ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.