ఏలూరులో వింత రోగ బాధితులను పరామర్శించిన జగన్.. రేపు విచారణ చేయనున్నకేంద్ర బృందం

ఏలూరులో వింత రోగ బాధితులను పరామర్శించిన జగన్..  రేపు విచారణ చేయనున్నకేంద్ర బృందం

పశ్చిమ గోదావరి జిల్లా: వింత రోగంతో అస్వస్థతకు గురై ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఇవాళ ఉదయం  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి  మరియు ఏపీ  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు. భయపడాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకుంటుందని అభయం ఇచ్చారు.

మరో వైపు వింతరోగం బారిన పడిన బాధితుల సంఖ్య  అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం 341 మందికి సోకినట్లు నిర్ధారణ కాగా.. మధ్యాహ్నం 2 గంటల సమయానికి 448కి చేరుకున్నట్లు సమాచారం. ఈ వ్యాధి నుంచి కోలుకుని  ఇప్పటికే 222 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 9మందిని విజయవాడ,  గుంటూరు ఆస్పత్రులకు తరలించారు. దీంతో ఏలూరుకు  అత్యవసరంగా కేంద్ర  వైద్యం బృందాన్ని పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ప్రజల ఆకస్మిక అనారోగ్యంపై రేపు కేంద్ర బృందం విచారణ చేయనుంది. ఈ బృందంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జంషెడ్ నాయర్,  డాక్టర్ అవినాష్ డియోష్టవర్, వైరాలజిస్ట్, డాక్టర్ సంకేత్ కులకర్ణి తదితరులు ఉన్నారు. రేపు  సాయంత్రంలోగా  ప్రాథమిక నివేదికను సమర్పించాలని ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (పిహెచ్ డివిజన్) ఆదేశాలు జారీ చేశారు.

వింత వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు ఒకరు మృతి చెందారు. వింత రోగానికి మాస్ హిస్టీరియా కారణమని సైక్రియాటిస్టులు చెబుతుండగా…న్యూరో టాక్జిన్స్ కారణం కావచ్చని ఎయిమ్స్ నిపుణుల అంచనా. వాస్తవాలు నిర్ధారించుకునేందుకు రేపు కేంద్ర నిపుణుల బృందం ఏలూరుకు  వచ్చి విచారణ చేయనుంది.

for more News..

లారీని ఢీ కొట్టిన కారు..ముగ్గురు మృతి