
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించబోతున్నారు. మార్చి 16 ఉదయం 10.26 గంటలకు ఇడుపులపాయనుంచి బస్సుయాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు. మొదట నిర్ణయించిన తేదీని వాయిదా వేసి.. కొత్త తేదీ ప్రకటించారు పార్టీ నాయకులు. ఈ బస్సుయాత్రతోనే… ఎన్నికల ప్రచార హోరును ఆయన ప్రారంభించబోతున్నారు.
ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్మృతి స్థలం వద్ద… నివాళులర్పించి.. ఆయన ఆశీస్సులతో యాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు జగన్. పార్టీలో చేరుతున్న వారు పెరిగిపోవడంతో… ఇవాళ ప్రారంభించాల్సిన బస్సుయాత్ర ముహూర్తం దాటిపోయిందని పార్టీ వర్గాలు తెలిపాయి. తమ పార్టీ నుంచి లోక్ సభకు, అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను ఖరారు చేసి.. మార్చి 16న బస్సు యాత్ర ప్రారంభం సందర్భంగా ఇడుపులపాయలో ప్రకటించాలని జగన్ నిర్ణయించారు.