
విలన్‌గానే కాక, మంచి మంచి పాత్రలతో సెకెండ్ ఇన్సింగ్స్‌లో దూసుకుపోతున్నారు జగపతిబాబు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ బిజీయెస్ట్ ఆర్టిస్ట్‌గా మారారు. ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘సింబా’. ద ఫారెస్ట్ మ్యాన్ అనేది ట్యాగ్‌లైన్. మురళీ మనోహర్ రెడ్డి దర్శకుడు. డైరెక్టర్ సంపత్ నంది కథను అందిస్తూ, రాజేందర్ రెడ్డితో కలిసి నిర్మిస్తున్నారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు ప్రకృతి ప్రేమికుడిగా కనిపించనున్నారు. నిన్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో భుజాలమీద చెట్లను మోసుకుంటూ, వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో కనిపిస్తున్న జగపతిబాబు పోస్టర్ మూవీపై ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తోంది. ‘ఇదిగో మన ప్రకృతి మాత సొంత బిడ్డ. వరల్డ్ ఎన్విరాన్ మెంట్ డే సందర్భంగా జగపతిబాబును ‘ద ఫారెస్ట్ మ్యాన్’గా పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు సంపత్ నంది. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. డి.కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నాడు.
మరిన్ని వార్తల కోసం...