
- ఎంపీ రఘునందన్పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఫైర్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై అనవసర విమర్శలు చేస్తే మర్యాదగా ఉండదని, ప్రధాని మోదీని తాను చవట అని అంటే భరిస్తావా.. అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావుపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన సీఎల్పీ వద్ద మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అప్పులు చేసినప్పుడు నోరు మెదపని రఘునందన్ ఇప్పుడు సీఎం రేవంత్ పై విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
కాంగ్రెస్ క్యాడర్ ను తట్టుకునే శక్తి బీజేపీకి, రఘునందన్ కు లేదన్నారు. బీఆర్‌ఎస్ పుణ్యమా అని రఘునందన్ గెలిచారన్నారు. తాను నోరు విప్పి మాట్లాడితే రఘునందన్ ఉరివేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నాలుక చీరేస్తామని కేటీఆర్ అంటుండని, అది ఆయనతో అవుతుందా అని ప్రశ్నించారు. కేటీఆర్ సినిమా స్క్రిప్టు రాసుకొని వచ్చి చదువుతున్నడని ఫైర్ అయ్యారు.