
చెప్పిన టైంలోపు రైతు రుణమాఫీ చేయడంతో... బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు నిద్రపట్టడం లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. పదేళ్లలో 7 లక్షల కోట్లు అప్పులు చేసిన కేసీఆర్, అందులో 26 వేల కోట్లే రైతులకు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ 6 నెలల్లోనే 31వేల కోట్లు ఇచ్చిందని చెప్పారు.
కేంద్రంలోని బీజేపీ కార్పోరేట్ల రుణాలు మాఫీ చేసిందే తప్పా.. రైతులకు చేసిందేమీ లేదన్నారు. నల్లచట్టాలకు వ్యతిరేకంగా ధర్నాచేసిన రైతులను హత్యచేశారని మండిపడ్డారు. కొందరు నేతలు రైతులపై సినిమాలు తీసి డబ్బు సంపాదించి.. రైతు వ్యతిరేకమైన బీజేపీకి మద్ధతు ఇస్తున్నారని విమర్శించారు జగ్గారెడ్డి.