- మళ్లీ విమర్శిస్తే.. కేసీఆర్ గురించి నేను మాట్లాడతా, జాగ్రత్త: జగ్గారెడ్డి
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. బుధవారం గాంధీ భవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశ రాజకీయాలపై రాహుల్ గాంధీకి విజన్ లేదని కేటీఆర్ అన్న మాటలు ఆయన రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రతి ఒక్కరికీ రాజకీయం, అధికారం అవసరమని.. కానీ ఇతరులపై చేసే విమర్శలు హూందాగా ఉండాలని హితవుపలికారు. కేటీఆర్ ఇంకోసారి రాహుల్ గురించి మాట్లాడితే తాను కేటీఆర్ తండ్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గురించి మాట్లాడాల్సి వస్తుందన్నారు.
మళ్లీ రాహుల్ గురించి మాట్లాడితే.. నేను కేసీఆర్ సంగతులు బయటపెడతా. జాగ్రత్త!” అంటూ కేటీఆర్ ను జగ్గారెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకపోతే కేసీఆర్, కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించారు. ఆమె ఇచ్చిన తెలంగాణతో రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరి, ఇప్పుడు కాంగ్రెస్ను, రాహుల్ను విమర్శించడం కేటీఆర్ సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు.
