దివ్యాంగులను చిన్నచూపు చూడొద్దు : లంక రవి

దివ్యాంగులను చిన్నచూపు చూడొద్దు : లంక రవి
  • లయన్స్ క్లబ్ జిల్లా సెక్రటరీ లంక రవి

బోధన్, వెలుగు : దివ్యాంగ చిన్నారులను చిన్నచూపు చూడొద్దని, ఆదరించి ఉన్నతంగా ఎదిగేలా ప్రోత్సహించాలని లయన్స్ క్లబ్ జిల్లా సెక్రటరీ లంక రవి, సభ్యులు అన్నారు. బుధవారం బోధన్ పట్టణంలోని భవిత కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దివ్యాంగులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పద్మ, సందీప్, సీఆర్పీలు దేవానంద్, యూసుఫ్, విజయ్, రమేశ్, శివానంద పాల్గొన్నారు.  

వ్యాక్సినేషన్​ కేంద్రానికి కుర్చీల అందజేత

పిట్లం : పిట్లం వ్యాక్సినేషన్ కేంద్రానికి బుధవారం పిట్లం లయన్స్​క్లబ్ ప్రెసిడెంట్ మున్నూరు నారాయణ కుర్చీలను అందజేసి మాట్లాడారు. పిట్లం పాత పంచాయతీ ఆఫీసులోని వ్యాక్సినేషన్​ కేంద్రానికి వచ్చే వారు కుర్చీలు లేక కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారని నిర్వాహకులు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. క్లబ్​ సభ్యు సహకారంతో కూర్చీలు కొనుగోలు చేసి అందించామన్నారు. క్లబ్​ జిల్లా కమిటీ సభ్యులు మర్గల వేణుగోపాల్, కోశాధికారి మారుతిరెడ్డి, సెక్రటరీ బాలు, సభ్యులు బెజుగం చంద్రశేఖర్ పాల్గొన్నారు.