- అగ్రోస్ చైర్మన్ బాల్ రాజు
వర్ని, వెలుగు : బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థుల గెలుపు ఖాయమని అగ్రోస్ చైర్మన్ కాసుల బాల్‌రాజు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం రుద్రూర్ మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే అభ్యర్థులకు పట్టం కట్టబెడుతాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందన్నారు. ఫ్రీ బస్సు, మహిళా సంఘాలకు వడ్డీ మాఫీ, సబ్సిడీ రుణాలు, రూ.500 గ్యాస్సరఫరా, ఇందిరమ్మ ఇండ్ల వంటి పథకాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందన్నారు.
రేషన్ షాపుల ద్వారా పేదల సన్నబియ్యం అందజేయడంతోపాటు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కనుమరుగవడం ఖాయమని విమర్శించారు. బీజేపీ గొప్పలు చెప్పుకోవడమే కానీ, పల్లెల అభివృద్ధి కోసం చేసిందేమి లేదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించి అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఆయనవెంట పోచారం సురేందర్ రెడ్డి, తోట అరుణ్‌కుమార్, పత్తి రాము, అక్కపల్లి నాగేందర్ తదితరులు ఉన్నారు.
