ఓట్ చోరీకి పాల్పడుతున్న బీజేపీ : డీసీసీ అధ్యక్షుడు నగేశ్రెడ్డి

ఓట్ చోరీకి పాల్పడుతున్న బీజేపీ : డీసీసీ అధ్యక్షుడు నగేశ్రెడ్డి

నిజామాబాద్ రూరల్, వెలుగు :  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఓట్ చోరీకి పాల్పడుతుందని డీసీసీ అధ్యక్షుడు నగేశ్​రెడ్డి ఆరోపించారు. బుధవారం డిచ్​పల్లి మండలంలో పర్యటించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ పారదర్శంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఎలక్షన్​ కమిషన్​ బీజేపీ సర్కార్​కు జేబు సంస్థగా మారిందన్నారు. ఇటీవల ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో తప్పుదోవలో విజయం సాధించారని విమర్శించారు. అంబానీ, ఆదానీ వంటి కార్పొరేట్ సంస్థలకు ప్రజాధనాన్ని దోచిపెడుతున్న కేంద్రంలోని బీజేసీ సర్కర్​కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం తథ్యమన్నారు. 

త్వరలో జరిగే తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్​ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్​బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించేలా పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలన్నారు. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుందని, వారు చేసిన అప్పుల చిట్టాను ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పల్లెపల్లెన వివరించి అభ్యర్థులకు గెలుపునకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.  సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్​గౌడ్, పలువురు కాంగ్రెస్​ లీడర్లు పాల్గొన్నారు.