దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డిటౌన్, వెలుగు : దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​  అన్నారు.  బుధవారం అంతర్జాతీయ  దివ్యాంగుల పురష్కరించుకొని కలెక్టరేట్​లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. దివ్యాంగుల హక్కులు, గౌరవం, సమానత్వం సామాజిక భాగస్వామ్యాన్ని  బలోపేతం చేసేందుకు  కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.   దివ్యాంగులు ప్రతిభ, కష్టపడి పని చేయగల శక్తి, సంకల్పబలంతో అనేక రంగాల్లో రాణిస్తున్నారన్నారు. జిల్లా వయోవృద్ధుల అధికారి ప్రమీల, డీఆర్డీవో సురేందర్ పాల్గొన్నారు.  

ఎంట్రీలు ఎప్పటికప్పుడు చేపట్టాలి 

కొనుగోలు సెంటర్లలో వడ్లు కాంటా కాగానే  యాప్​లో ఎంట్రీ చేయాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ సూచించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్​లో అధికారులతో రివ్యూ నిర్వహించి మాట్లాడారు. సెంటర్లలో ఎలాంటి జాప్యం జరగవద్దన్నారు.   యాప్​లో ఎంట్రీ చేయటంలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడిషనల్ కలెక్టర్ విక్టర్​, డీఆర్డీవో సురేందర్, డీఎస్​వో వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.