ఖిలా వరంగల్ (మామునూరు), వెలుగు: తడి, పొడి చెత్తను వేరు చేసి అందించడం ప్రజలందరి బాధ్యత అని మేయర్ గుండు సుధారాణి అన్నారు. బుధవారం ‘తడి, పొడి చెత్తను వేరు చేద్దాం.. స్వచ్ఛ వరంగల్ ను నిర్మిద్దాం’ అన్న నినాదంతో వరంగల్ పరిధి 42 వ డివిజన్ రంగశాయిపేట, 38 వ డివిజన్ ఖిలా వరంగల్, 32 వ డివిజన్ ప్రాంతాల్లోని పలు కాలనీల్లో క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలను మేయర్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి నిర్వహించారు.
ఈ సందర్భంగా చెత్తను వేరు చేసి అందించడానికి వేర్వేరు డబ్బాలు అందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గుండు చందన పూర్ణ చందర్, బైరబోయిన ఉమా దామోదర్ యాదవ్, పల్లం పద్మ రవి, సీఎంహెచ్ ఓ రాజారెడ్డి, ఎంహెచ్ వో రాజేశ్, హెచ్ వో లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
