శివ్వంపేట, వెలుగు: మండలంలోని చెన్నాపూర్, పెద్ద గొట్టిముక్కుల, గూడూర్ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహసిని రెడ్డి, కాంగ్రెస్ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి పంచాయతీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తామంటూ పార్టీలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, నాయకులు నవీన్ గుప్తా, కృష్ణ గౌడ్, చాంద్ పాషా, అరుణ్ కుమార్, మల్లేశ్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ నేత
అమీన్పూర్: గుమ్మడిదల మండలం వీరారెడ్డిపల్లి గ్రామ మాజీ వార్డు సభ్యుడు కనకరాజు బుధవారం బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్నియోజకవర్గ ఇన్చార్జి కాట శ్రీనివాస్‌గౌడ్ కనకరాజుకు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ తన సత్తాను చాటుతుందన్నారు.
కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, మండల అధ్యక్షుడు నర్సింగ్‌రావు, బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వీరారెడ్డి, మాజీ సర్పంచ్ జైశంకర్గౌడ్, వీరారెడ్డిపల్లి గ్రామ నాయకులు ఉన్నారు.
