రెండో రోజు కొనసాగిన జగ్గారెడ్డి దీక్ష : భద్రాచలం మాజీ ఎమ్మెల్యే వీరన్న సంఘీభావం

రెండో రోజు కొనసాగిన జగ్గారెడ్డి దీక్ష : భద్రాచలం మాజీ ఎమ్మెల్యే వీరన్న సంఘీభావం

మెదక్/సంగారెడ్డి, వెలుగు: ఓట్​ చోరీకి వ్యతిరేకంగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్  రాజీనామా చేయాలనే డిమాండ్​ తో కాంగ్రెస్​ అగ్రనేతలు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి, టీజీఐఐసీ మాజీ చైర్మన్​ నిర్మల బుధవారం రాత్రి చేపట్టిన దీక్ష గురువారం రెండో రోజు కొనసాగింది. జగ్గారెడ్డి దీక్షకు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే వీరన్న, కాంగ్రెస్​ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, పాజి అనంత కిషన్,  మున్సిపల్  కౌ న్సిలర్లు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్​ను అనుకూలంగా మార్చుకొని బీజేపీ పలు రాష్ట్రాల్లో ఎన్నికల వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకుందని విమర్శించారు. ఎన్నికల కమిషన్ సహకారంతోనే బీజేపీ మూడుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని, ఈ అంశంపై రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో ప్రశ్నలు లేవనెత్తారని గుర్తు చేశారు. ఇది కాంగ్రెస్  రాజకీయ పోరాటం కాదని, ప్రజల ఓటు హక్కును కాపాడే రాజకీయ యుద్ధమని తెలిపారు.