కరోనాతో జగిత్యాల అడిషినల్ ఎస్పీ మృతి

కరోనాతో జగిత్యాల అడిషినల్ ఎస్పీ మృతి

కరోనా బారినపడి జగిత్యాల అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తి బుధవారం తెల్లవారు జామున మృతిచెందారు. ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో వారం రోజులుగా కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 5 రోజుల్లో ఆయన తన సర్వీస్ నుంచి రిటైర్ కావలసి ఉంది. ఇంతలోనే ఆయన కరోనా వల్ల మృత్యువాత పడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దక్షిణామూర్తి అత్యధిక కాలం విధులు నిర్వహించారు. సమ్మక్క సారాలమ్మ జాతర సమయంలో దక్షిణామూర్తిని స్పెషల్ ఆఫిసర్ గా ప్రభుత్వం నియమించింది.1989లో ఎస్సైగా పోలీస్ శాఖలోకి వచ్చిన దక్షిణా మూర్తి.. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎస్సై, సీఐ, డీఎస్పీగా విధుల నిర్వర్తించారు.

వరంగల్ లో సంచలనం కలిగించిన యాసిడ్ దాడి కేసులో నిందితుల ఎన్ కౌంటర్ లో కూడా ఆయన పాల్గొన్నారు. కరీంనగర్ సవారాన్ స్ట్రీట్ కు చెందిన దక్షిణ మూర్తి.. జిల్లాల పునర్విభజనతో జగిత్యాల అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అసాంఘీక కార్యకలాపాల కట్టడిలో కఠినంగా వ్యవహరిస్తారని పోలీస్ విభాగంలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది.

ఏఎస్పీ మరణం పట్ల జిల్లా ఇంచార్జ్ ఎస్పీ వి.బి. కమలాసన్ రెడ్డి, జిల్లా పోలీస్ అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

For More News..

హోంఐసోలేషన్ లోకి ఉత్తరాఖండ్ సీఎం

స్కాలర్‌షిప్ కు అప్లై చేయడానికి వెళ్లిన బాలికపై హత్యాచారం

పెన్షన్ తెచ్చుకోనీకిపోతె.. 92 మందికి కరోనా