పంచాయతీ ఎన్నికల్లో పాత గొడవల చిచ్చు.. జగిత్యాల జిల్లా తాళ్ల ధర్మారంలో దారుణం

పంచాయతీ ఎన్నికల్లో పాత గొడవల చిచ్చు..   జగిత్యాల జిల్లా తాళ్ల ధర్మారంలో దారుణం
  • అన్నదమ్ముల మధ్య గొడవ.. ఒకరు హత్య 

   జగిత్యాల టౌన్, వెలుగు: అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవలో ఒకరిని కొట్టిచంపారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తాళ్లధర్మారంలో వరుసకు అన్నదమ్ములైన గంగయ్య, ఆశయ్య మధ్య కొంతకాలంగా గొడవలు నడుస్తున్నాయి. దీంతో గంగయ్య కుటుంబం గ్రామం వదిలి జగిత్యాలలో ఉంటుంది. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు గంగయ్య కుటుంబంతో సొంతూరుకు వెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి అన్నదమ్ముల మధ్య మళ్లీ ఘర్షణ జరిగింది. ఆవేశంలో గంగయ్య కర్రతో ఆశయ్య(50)పై దాడి చేయడంతో స్పాట్ లో చనిపోయాడు. మృతుడి కొడుకు వర్ధన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు బీర్పూర్ ఎస్ఐ రాజు తెలిపారు.