
జగిత్యాల, వెలుగు : నార్కోటిక్ డ్రగ్‌ను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై జగిత్యాలకు చెందిన ఈఎన్‌టీ డాక్టర్ మదన్‌మోహన్‌ను నార్కోటిక్ బ్యూరో, డ్రగ్ ఆఫీసర్లు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అనస్థీయాకు సంధించిన డ్రగ్‌ను రూల్స్‌కు విరుద్ధంగా ఇటీవల హైదరాబాద్‌లో వాడినట్లు ఆఫీసర్లు గుర్తించారు. దీంతో ఎంక్వైరీ చేపట్టగా ఆ డ్రగ్‌ను డాక్టర్ మదన్‌మోహన్ జగిత్యాలలో కొనుగోలు చేసినట్లు తేలింది. దీంతో నార్కోటిక్ బ్యూరో, డ్రగ్, పోలీస్ ఆఫీసర్లు శుక్రవారం జగిత్యాలలోని మానస ఈఎన్‌టీ హాస్పిటల్‌లో తనిఖీలు చేపట్టారు. డాక్టర్ మదన్‌మోహన్‌ను అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయి విచారణ కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు.