- ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల టౌన్, వెలుగు: ప్రజల సౌకర్యార్థం ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ఆఫీస్‌లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆరుగురు బాధితుల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకొని బాధితులకు సత్వర న్యాయం చేయాలన్నారు.
ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా పనిచేయాలన్నారు. రాజన్నసిరిసిల్ల, వెలుగు: సమస్యల పరిష్కారం కోసమే గ్రీవెన్స్ డేను నిర్వహిస్తున్నామని ఎస్పీ మహేశ్ బి.గీతే అన్నారు. సోమవారం ఎస్పీ ఆఫీస్‌లో బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి 18 ఫిర్యాదులు వచ్చాయన్నారు.

