
- జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు
జగిత్యాల టౌన్, వెలుగు: కవితకు మతిభ్రమించిందని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు అన్నారు. శుక్రవారం జిల్లా పార్టీ ఆఫీస్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ఉద్యమంలో కవిత పుట్టలేదని, మొదలయ్యాకే వచ్చారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం వద్ద నిద్రపోయిన పని చేయించిన నేత హరీశ్ రావు అని పేర్కొన్నారు. మొన్నటి వరకు కేటీఆర్, ఇప్పుడు హరీశ్‌రావు - సంతోష్ రావును టార్గెట్ చేయడం వెనక ఎవరో నడిపిస్తున్నారనేది స్పష్టమవుతుందని చెప్పారు.
వాళ్ల ఇంట్లో.. వీళ్ల ఇంట్లో బంగారం కాదు, నీ ఇంట్లోని బంగారం లెక్క చూసుకో.. అంటూ తీవ్రంగా విమర్శించారు. క్యాడర్ కవిత వైపు వెళ్తే, దొంగలను వెంబడించడమే అవుతుందని, వాళ్లే అనుభవిస్తారని హెచ్చరించారు. మాజీ జెడ్పీ చైర్ పర్సన్ వసంత, మాజీ కౌన్సిలర్లు దేవేందర్ నాయక్, సమిండ్ల వాణి శ్రీనివాస్, శివ కేసరి బాబు, మహిపాల్ రెడ్డి, ఆనంద్ రావు, గంగాధర్, సురేశ్ పాల్గొన్నారు.