జగిత్యాలలో ఆడపిల్ల పుట్టిందని వైభవంగా వేడుకలు

జగిత్యాలలో ఆడపిల్ల పుట్టిందని వైభవంగా వేడుకలు

ఆడపిల్ల పుడితే ఇప్పటికీ భారంగా కొంతమంది భావిస్తుంటారు. అమ్మాయి పుట్టిందని అనగానే.. బాధ పడుతుంటారు. మరికొంతమంది ఆమెను మానసికంగా.. శారీరకంగా వేధిస్తుంటారు. ఇంట్లో నుంచి వెళ్లగొడుతారు. ఆడపిల్ల పుట్టిందని తెలుసుకుని.. సంతోషం కంటే.. ఎక్కువగా బాధ పడుతుంటారు. అరిష్టమని భావిస్తుంటారు. కానీ కొంతమంది తమింట్లో మహలక్ష్మి పుట్టిందని భావించి అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహిస్తుంటారు. ఇటీవలే పలు ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా.. జగిత్యాల జిల్లాలో పుట్టిన బిడ్డను తీసుకొచ్చిన కోడలికి గ్రాండ్ వెల్కమ్ చెప్పింది అత్తింటి కుటుంబం. ఇల్లంతా పూలతో అందంగా అలంకరించింది. పూలపై చిన్నారి అడుగులు వేయించారు. 

ఇంటికి మహాలక్ష్మి అని చెప్పేలా.. అపూర్వ వేడుకను నిర్వహించింది జగిత్యాల విద్యానగర్ కు చెందిన ఓ కుటుంబం. పుట్టిన బిడ్డను ఇంటికి తీసుకువచ్చి, ఇల్లంతా అలకరించి, పూల మధ్యలో పడుకోబెట్టి వైభవంగా వేడుకలు నిర్వహించింది. విద్యానగర్ లో ఉంటున్న రాహుల్ - సుప్రియ దంపతులకు మొదటి కాన్పులోనే ఆడపిల్ల జన్మించింది. ఆడపిల్ల పుట్టిందని తెలిసిన వెంటనే ఆ కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివెరిశాయి. సుప్రియ పుట్టించి నుంచి పాపతో అత్తవారి ఇంటికి రావటంతో వారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు కుటుంబసభ్యులు. పాప ఇంటికి రాగానే టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇంటిని పూలతో అందంగా అలకరించారు. ఇంట్లో 8 రూపాల్లో అమ్మవారి ప్రతిమల్ని ఏర్పాటు చేసి, ఇంట్లోకి హారతితో పాపను ఆహ్వానించారు. ఆడపిల్ల జన్మించటంతో ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని పాపకు మహాలక్ష్మిగా పేరు పెట్టారు కుటుంబసభ్యులు. 

మరిన్ని వార్తల కోసం : -

కల్లాల్లో ధాన్యం తడిసిపోతోందని రైతుల ఆందోళన


ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం