నిమ‌జ్జ‌నంలో బోగ శ్రావణికి త‌ప్పిన‌ ప్ర‌మాదం

V6 Velugu Posted on Sep 19, 2021

జగిత్యాల జిల్లా: జగిత్యాల చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణికి ప్ర‌మాదం త‌ప్పింది. ఆదివారం జగిత్యాల జిల్లాకేంద్రంలో జ‌రిగిన‌ వినాయక నిమజ్జన  వేడుకల్లో పాల్గొన్నారు శ్రావ‌ణి. అక్క‌డి ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. జగిత్యాల చింతకుంట చెరువు వద్ద నిర్వహించిన వినాయక నిమజ్జన వేడుకల్లో జగిత్యాల చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి పాల్గొన్నారు. వినాయకులను చెరువులో నిమజ్జనం చేసేందుకు మహిళా కౌన్సిలర్లతో కలిసి నాటు తెప్పపై నిల్చుని చెరువులోకి వెళ్లారు. బరువు ఎక్కువ కావడంతో తెప్ప ఒక వైపు ఒరిగి చైర్‌ పర్సన్‌ శ్రావణి నీటిలో పడిపోయారు. అయితే వెంట‌నే అక్కడే ఉన్న గంగపుత్రులు తేరుకుని కాపాడడంతో ప్రమాదం తప్పింది. ఆమెకు ఏమీ కాక‌పోవ‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Tagged ganesh nimajjanam, , Jagtial Municipal Chief, Boga Sravani

Latest Videos

Subscribe Now

More News