- ఎస్పీ అశోక్‌కుమార్
కోరుట్ల, వెలుగు: విజిబుల్ పోలీసింగ్‌పై సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని జ-గిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం మెట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. పీఎస్ పరిధిలోని కేసుల నమోదు, శాంతి భద్రతల పరిరక్షణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌లో రికార్డుల నిర్వహణ, కేసు డైరీలు, రిజిష్టర్లను పరిశీలించారు. పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించి నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా గ్రామాలను తరచూ సందర్శిస్తూ, ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరుచుకోవాలన్నారు.
రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను యాక్సిడెంట్లు జోన్లుగా, బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. చైనా మాంజాను అమ్మినా, వినియోగించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాంజా అమ్మాకాల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఎస్పీ వెంట డీఎస్పీ రాములు, సీఐ అనిల్ కుమార్, ఎస్ఐ కిరణ్ కుమార్, సిబ్బంది ఉన్నారు.
