
నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం..‘స్పై’ (Spy). ఈ మూవీ స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్(Subhas Chandra Bose) మరణం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా తెరకెకిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ రానుందని తెలుస్తోంది. ‘స్పై’ మూవీలో నిఖిల్ బాలయ్య(Balayya) ఫ్యాన్ గా నటిస్తున్నాడని సమాచారం. ఈ మూవీ లో జై బాలయ్య(Jai Balayya ) సాంగ్ బీట్ కూడా ఉంటుందని సినీ వర్గాల టాక్ వినిపిస్తోంది.
రీసెంట్ గా రిలీజ్ అయినా ‘స్పై’ ట్రైలర్ తో అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగాయి. నిఖిల్ కు జోడీగా ఐశ్వర్య మేనన్ (Iswarya Menon) , సాన్య ఠాకూర్ (Sanya thakur) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే అభినవ్ గోమఠం(Abhinav Gomatam), ఆర్యన్ రాజేశ్(Aryan Rajesh), జిస్సు సెంగుప్త(Jisshu Sengupta), మార్కండ్ దేశ్‍పాండే(Makrand Deshpande) తదిదరులు ఈ సినిమాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.
ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్(Vishal Chandrashekhar), శ్రీచరణ్ పాకాల(Sricharan Pakala) సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. స్పై చిత్రాన్ని కే రాజశేఖర్ రెడ్డి(K. Raja Shekhar Reddy), చరణ్ తేజ్ ఉప్పాలపాటి(Charan Tej Uppalapati) నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ జూన్ 29న రిలీజ్ కాబోతుంది.