
క్లాస్, మాస్ అనే తేడా లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్‌తో మెప్పించే కోలీవుడ్ స్టార్ సూర్య, లాస్ట్ ఇయర్ ‘జై భీమ్’ సినిమాతో సూపర్ సక్సెస్‌ను అందుకున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నమైన సినిమా ఇది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమాకి దేశవ్యాప్తంగా అప్రిషియేషన్స్ లభించాయి. ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ మూవీస్‌కి అవార్డ్స్ ఇచ్చే ఆస్కార్ సంస్థ, తమ యూట్యూబ్ చానెల్‌లో ‘జై భీమ్’ సినిమాకి స్థానం కల్పించింది. ఈ సినిమాలోని పన్నెండు నిమిషాల సీన్స్‌ని ‘సీన్ ఎట్ ద అకాడెమీ’ పేరుతో ‘ఆస్కార్స్’ చానెల్‌లో అప్‌లోడ్ చేశారు. దాంతో సూర్య అభిమానులు గర్వంగా ఫీలవుతున్నారు. ఇండియన్ సినిమా గర్వించదగ్గ విషయం అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అట్టడుగు కులాలకు చెందిన అమాయకులకు పోలీసు వ్యవస్థ వల్ల ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయో కళ్ళకు కట్టినట్లు చూపించిన ఈ చిత్రం.. లాయర్ చంద్రు జీవితం ఆధారంగా రూపొందింది. సూర్య నటిస్తూ నిర్మించాడు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించాడు.