T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఎన్నో అనుమానాలు, పాత రికార్డులు, అపోహలను పటాపంచలు చేస్తూ భారత్ మరోసారి ప్రపంచ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగడంతో కొందరు అభిమానులు సందేహాలు వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో భారత్ గెలవలేదని, ఈసారి కూడా అదే జరుగుతుందని పేర్కొన్నారు. అంతేకాదు, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇండియాకు అచ్చిరాదని కూడా అన్నారు.
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో న్యూజిలాండ్‌పై భారత్ విజయాలు చాలా తక్కువగా ఉన్నాయనే గత రికార్డులను కూడా పలువురు గుర్తు చేశారు. కానీ ఈసారి టీమిండియా ఆ అనుమానాలన్నింటినీ తుడిచిపెట్టింది. బ్యాటింగ్‌లో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడి 255 పరుగుల భారీ స్కోర్ చేశారు. అనంతరం బౌలింగ్‌లో క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. ఫీల్డింగ్‌లో కూడా అద్భుతమైన క్యాచులు, ఫీల్డింగ్‌తో మ్యాచ్‌పై భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఆల్రౌండ్ షోతో రాణించిన టీమిండియా ఈ విజయంతో మరోసారి విశ్వవిజేతగా అవతరించింది.
భారత్ వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. 40 కోట్ల మంది భారతీయుల ఆశలను నిజం చేస్తూ సూర్యకుమార్ యాదవ్ సేన పొట్టికప్పును సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 96 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే టీమిండియా ఇప్పటి వరకు మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007లో టీ20 వరల్డ్ కప్ ని తొలిసారి గెలవగా.. అనంతరం 2024లో రోహిత్ శర్మ ఆధ్వర్యంలో రెండోసారి సొంతం చేసుకోగా.. 2026లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు మూడోసారి విశ్వవిజేతనగా అవతరించింది.
India Win Celebration 🎉🏆🥳🇮🇳
— Digital मारवाड़ी (@digital_marwadi) March 8, 2026
Credit - Ahmedabad Love (Insta)#INDvsNZ #T20WorldCup2026final #IndiaVsNewZealand pic.twitter.com/Ky6wypUVi3
