రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతాదేవి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రామాయణ’. నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సమర్పణలో, డినెగ్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ భాగస్వామ్యంతో నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో రావణుడి పాత్ర పోషిస్తున్న కన్నడ స్టార్ యశ్ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా మొదటి భాగం దీపావళికి థియేటర్స్‌లో రానుంది.
తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. శుక్రవారం ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘జై జై రామ్’ అంటూ సాగే తెలుగు వెర్షన్ సాంగ్‌ను ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేయగా, రాకేందు మౌళి లిరిక్స్ రాశాడు. దీపాలి సహాయ్, రాఘవ్ కౌశిక్ పాడారు. శ్రీరాముడిని స్మరిస్తూ రూపొందిన ఈ పాటలో ఆధ్యాత్మిక భావాన్ని, సినిమాటిక్ సౌండ్‌తో ప్రజెంట్ చేశారు. శ్రీరాముడి కరుణ, ధర్మాన్ని పాట సాహిత్యం ద్వారా చూపించారు. పాటలో పలు మార్లు వినిపించే ‘జై జై రామ్’ అనే నామస్మరణ ఈ పాటకు భక్తి భావాన్ని అందిస్తుంది.
