
ముషీరాబాద్, వెలుగు : పెండింగ్ స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్స్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం దోమలగూడలోని బీసీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యులు సమస్యల పరిష్కారం గురించి మాట్లాడటం లేదని మండిపడ్డారు.
స్కాలర్‌షిప్‌లు సకాలంలో విడుదల చేయకపోవడంతో పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బత్తిని రాజు, నాగరాజు, ప్రవీణ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.