బీసీలకు ప్రధాని ఏం చేశారో చెప్పాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీలకు ప్రధాని ఏం చేశారో చెప్పాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్
  • ఢిల్లీ బీసీల సమరభేరి పేరిట ధర్నా 

న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ పదేండ్ల తన పాలనలో బీసీలకు ఏం చేశారో చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. బీసీల సంక్షేమం, అభివృద్ధి, సామాజిక, రాజకీయం విధానంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే దేశంలోని 70 కోట్ల మంది బీసీలను ఓట్లు అడగాలన్నారు.

గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో  బీసీల సమరభేరి పేరిట ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్, కాంగ్రెస్ నేత వీ.హనుమంతరావు, ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, బీఎస్పీ, సమాజ్ పార్టీల నుంచి అఖిలపక్ష పార్టీల ప్రతినిధులు పాల్గొని, సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..ఓబీసీనని చెప్పుకునే మోదీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈడబ్ల్యూఎస్ పేరుతో అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించారని ఫైర్ అయ్యారు.