బీజేపీలో చేరితే రూ.25 కోట్లు ఇస్తామన్నారు.. ఆప్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

బీజేపీలో చేరితే రూ.25 కోట్లు ఇస్తామన్నారు.. ఆప్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

లోక్‌సభ ఎన్నికలు, లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌తో పంజాబ్‌లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఒకరిపై ఒకరి తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఆ రాష్ట్ర ఆప్ ఎమ్మెల్యే బుధవారం  బీజేపీ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసి గెలవకుండా బీజేపీ మెజార్టీ కోసం ప్రయత్నిస్తోందని పంజాబ్ లోని ఆమ్  ఆద్మీ పార్టీకి చెందిని జలాలాబాద్‌  ఎమ్మెల్యే  గోల్డీ కాంబోజ్‌ అన్నారు. ఈరోజు మరో ఇద్దరు ఆప్ నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆప్ పార్టీని విడిచి బీజేపీలో చేరితే తనకు రూ.20-25 కోట్లు ఇస్తామని బీజేపీతో సంబంధాలు ఉన్న ముగ్గురు వ్యక్తులు ఫోన్ చేసి చెప్పారని ఆరోపించారు.  

ఇతర పార్టీ నేతలను ప్రలోభపెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు బీజేపీ ప్రయత్నింస్తోందని ఆప్ నాయకులు మండిపడ్డారు. తనకు వచ్చిన ఫోన్ కాల్స్ నెంబర్లు కూడా మీడియా సమావేశంలో  గోల్డీ కాంబోజ్‌ గోల్డీ తెలిపారు. బీజీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, పంజాబ్ చీఫ్ సునీల్ కుమార్ జాఖర్ ఆధ్వర్యంలో ఈరోజు ఆప్ జలంధర్‌ ఎంపీ సుశీల్ కుమార్ రింకూ, ఎమ్మెల్యే శీతల్ అంగురాల్ బీజేపీలో చేరారు.