జల్లికట్టు జోష్.. ఘనంగా ప్రారంభమైన పోటీలు

జల్లికట్టు జోష్.. ఘనంగా ప్రారంభమైన పోటీలు

తమిళనాడులో జల్లికట్టు పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మదురై జిల్లాలోని అవనియాపురం గ్రామంలో ఈరోజు(జనవరి 15) జల్లికట్టు పోటీలను ప్రారంభించారు. జనవరి రెండో వారంలో సంక్రాంతి పంట పండుగ సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు పోటీలను నిర్వహిస్తారు. వరసగా మూడు రోజుల పాటు ఈ క్రీడలు కొనసాగుతాయి. 

మొదటి రోజు(జనవరి 15) అవనియాపురంలో, రెండో రోజు(జనవరి 16) పాలమేడులో, మూడో రోజు(జనవరి 17) అలంగనల్లూరులో ఈ పోటీలను నిర్వహిస్తారు. 

కాగా.. కొత్తగా నిర్మించిన మధురై జల్లికట్టు స్టేడియంను జనవరి 23న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించనున్నారు. మదురై జిల్లాలోని అలంగనల్లూరు సమీపంలో నిర్మిస్తున్న కొత్త జల్లికట్టు స్టేడియానికి రాష్ట్ర మాజీ సీఎం, దివంగత డీఎంకే అధినేత కరుణానిధి పేరు పెట్టారు.